Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐటీ కారిడార్‌లో ఐదెకరాలకు ఫెన్సింగ్‌

ఐటీ కారిడార్‌లో ఐదెకరాలకు ఫెన్సింగ్‌

- Advertisement -


రూ.1000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
నవతెలంగాణ-సిటీబ్యూరో

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని ఐదెక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 42లో మెట‌ల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు వెళ్లే మార్గంలో అత్యంత విలువైన భూమిని కాజేయాల‌ని కొంత‌మంది ప్ర‌య‌త్నించారు. అక్క‌డ రెండు తాత్కాలిక షెడ్డులు వేసి ఒక గ‌దిని కూడా నిర్మించారు. ఐదెక‌రాల చుట్టూ రేకుల షీట్ల‌తో ప్ర‌హ‌రీ నిర్మించే క్ర‌మంలో హైడ్రాకు రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందింది. ఎన్నో ఏండ్లుగా ఈ భూమి త‌న‌దిగా చెబుతూ ఎవ‌రినీ అటువైపు రానీయ‌కుండా అడ్డుకుం టున్న ప‌రిస్థితుల్లో శేరిలింగంప‌ల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు హైడ్రా రంగంలోకి దిగింది. రెండు తాత్కాలిక షెడ్లతోపాటు గ‌ది, ఫెన్సింగ్‌ను హైడ్రా తొల‌గించింది. మొత్తం ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన త‌ర్వాత ఐదెక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. అలాగే ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ దాదాపు రూ. వెయ్యి కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -