Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ నిరంతర ప్రక్రియ

‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ నిరంతర ప్రక్రియ

- Advertisement -


రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి 
డాక్టర్ గౌరవ్ ఉప్పల్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజులతో ఆగిపోదని, నిరంతరం కొనసాగే ప్రక్రియ అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సమీక్ష నిమిత్తం బుధవారం నల్లగొండ జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు అంకితభావంతో అమలు చేశారని కితాబునిచ్చారు. 10 అంశాలను తీసుకుని ఒక వారం ఒక్కొక్క అంశాన్ని అమలు చేశారని, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. 591 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చినట్టు తెలిపారు. 22 బాల్య వివాహాలను నిరోధించారని, మాదక ద్రవ్యా లకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పది వేల ఫైళ్లను పరిష్కరించారని, లక్ష కిలోల చెత్తను సేకరించారని తెలిపారు. రూ.162 కోట్ల బ్యాంకు లింకేజీని మహిళా సంఘాలకు ఇచ్చినట్టు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌‌చంద్ర పవార్‌, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీర, ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్ నాయక్, డీఎఫ్ఓ రాజశేఖర్, డీఆర్ఓ దశరథ్, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -