సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ-మహబూబాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ మాతృమూర్తి మేకపోతుల కమలమ్మ సేవలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. బుధవారం మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో ఎంవీ రమణ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల పేదల అభ్యున్నతికి ఆదర్శమే కాకుండా సమాజ మార్పు కోసం, తన కుటుంబం నుంచి కుమారుడిని, కూతురిని అందించిన ఓ గొప్ప తల్లి అని కొనియాడారు. కమలమ్మ బాటలో ఎంతోమంది సీపీఐ(ఎం)కి సైనికులను అందిస్తున్నారని అన్నారు. వారి వారసత్వంతో సీపీఐ(ఎం) మరింత బలోపేతమై పోరాటాలను కొనసాగిస్తున్నదని తెలిపారు. పేదరికం ఉన్నంతకాలం కష్టజీవులకు, ఆకలి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని అన్నారు. పరామర్శించిన వారిలో.. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరాం నాయక్. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు శెట్టి వెంకన్న, డోర్నకల్ మండల కార్యదర్శి ఉప్పనపల్లి శ్రీనివాస్, గిరిజన సంఘం జిల్లా నాయకులు మాలోత్ కిషన్ నాయక్, గొల్లచర్ల గ్రామ కార్యదర్శి నరిగే ఓదేశ తదితరులు పాల్గొన్నారు.
కమలమ్మ సేవలు చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



