వీణవంక లో ఊరూరా చెరువుల పండుగ

నవతెలంగాణ – వీణవంక
మండల కేంద్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు చెరువుల ఉత్సవాలను వీణవంక లో ఊరూరా చెరువుల పండుగను గ్రామ కమిటీ, గ్రామపంచాయతీ అధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ, బోనాలతో చెరువుల వద్దకు చేరుకొని బతుకమ్మ ఆట ఆడారు. అలాగే . కట్టమైసమ్మకు బలిదానం చేశారు. అనంతరం గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నీల కుమారస్వామి, ఉపసర్పంచ్ ఒరెం బానుచందర్ గ్రామస్థులు పాల్గొన్నారు.

Spread the love