మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలి

Festivals should be celebrated secularly– రాష్ట్ర పాడిపరిశ్రమ సంస్థ ఛైర్మెన్‌ జ్ఞానేశ్వర్‌
– ఫిరంచెరువులో కార్పొరేటర్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు
నవతెలంగాణ-గండిపేట్‌
మతాలకతీతంగా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రాష్ట్ర ఛైర్మెన్‌ బోర్రా జ్ఞానేశ్వర్‌ముదిరాజు అన్నారు. శుక్రవారం బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ఫిరంచెరువులో కార్పొరేటర్‌ ఆసీయా ఖాజా ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఏ బ్లాక్‌ అధ్య క్షులు డి.నవీన్‌కుమార్‌తోపాటు జ్ఞానేశ్వర్‌ హాజర య్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కుల మతాలకతీంగా పండుగను జరుపుకుంటూ అందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు. ఇఫ్తార్‌ వింద్‌లో పాల్గొన్న వారిని కార్పొరేటర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ మేయర్‌ లతా ప్రేంకుమార్‌గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు శ్రీనాథ్‌రెడ్డి, రవీం దర్‌రెడ్డి, తలారి చంద్రశేఖర్‌, ముద్దం రాము, కాంగ్రెస్‌ నాయకులు నాగుల నరేందర్‌, టింకురెడ్డి, సంగారెడ్డి, గోపాల్‌, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love