నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో కంది, వరి, ప్రత్తి పంటలను ఏరువాక కేంద్రం, భువనగిరి ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ బి.అనిల్ కుమార్, ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు శుభమ్, బాలరాజు లు సందర్శించారు. శుక్రవారం జిల్లాలోని మోటకొండూరు, భువనగిరి మండలం లోని వీరవెల్లి, కూనూరు గ్రామాలలో పంటలను పరిశీలించారు. పూత దశలో ఉన్న కందిని మారుకా మచ్చల పురుగు ఆశించిందనారు. లద్దె పురుగులు ఆకులను, పువ్వులను కలిపి గూళ్గుగా చేసి మొగ్గలను తింటూ నష్టం కలిగిస్తున్నాయనీ, మారుకా మచ్చల పురుగు నివారణకు, ఎకరాకు 150 మి.లీ నొవాల్యురాన్ లేదా 400 మి.లీ ప్రొఫెనోఫాస్ ను పిచికారి చేయాలనీ సూచించారు. ప్రత్తిలో పండాకు తెగులు వలన ఆకులు ఎర్ర బడి, ఎండి రాలిపోతున్నాదయనీ, పండాకు తెగులు నివారణకు, లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటును 10 గ్రాముల యూరియాతో కలిపి పిచికారి చేయాలనారు. వరిలో కాటుక తెగులు ఆశించిడం వలన కంకిలో పసుపు రంగు గింజలు ఏర్పడుతున్నాయి. కాటుక తెగులు నివారణకు, ఎకరానికి 200 మి.లీ. ప్రొపికోనజోల్ లేదా 200 గ్రాముల కార్బెండజిమ్ ను పిచికారి. ఈ క్షేత్ర సందర్శనలో అభ్యుదయ రైతులు కంచి మల్లయ్య, బుగ్గా వెంకటేశ్, యెల్లా రెడ్డి, యాదయ్య, హైదరాబాద్ వ్యవసాయ కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.