బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు గాను బుధవారం మూడు నామినేషన్ లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. బీజేపీ పార్టీ నుండి ఏలేటి అన్నపూర్ణ మ్మ రెండు సెట్లు, బీఎస్పీ నుండి పల్లికొండ నర్సయ్య ఒకసెట్ నామినేషన్ సెట్ దాఖలు చేయడం జరిగింది. ఈనెల 6 న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఢీఎస్పీ ల నుండి ఒక్కోటి చొప్పున నామినేషన్ లు దాఖలు అయ్యాయి. నామినేషన్ లు ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఆరు సెట్ లు దాఖలు కావడం జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు.