రేణుకాస్వామికి కరెంటు షాక్ తో చిత్ర హింసలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి  కేసులో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతడికి కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిసింది. శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించారని సమాచారం. బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా, 8 చోట్ల కాలిన గుర్తులున్నాయట. రేణుకా స్వామిపై మొదట పవిత్రా గౌడనే దాడి చేసినట్లు తేలింది.

Spread the love