రాష్ట్రానికే వైశ్య సదన్ మోడల్: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

నవతెలంగాణ – సిద్దిపేట
వైశ్య సదన్, గౌడ ఫంక్షన్ హాల్ ప్రారంభానికి సిద్ధమయ్యాయని, నెలలోపు మిగులు పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని, రాష్ట్రానికే వైశ్య సదన్ మోడల్ అని  రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్ధిపేట శివారులో జీ+1 విధానంలో నిర్మించిన వైశ్య సదనం, రేణుకా ఎల్లమ్మ దేవాలయ సమీపంలోని గౌడ ఫంక్షన్ హాల్ పనులను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే కేటాయించిన నిధులు సరిపోక పోవడంతో అదనంగా నిధులు మంజూరు చేసినట్లు వైశ్య ప్వైశ్య సదన్, గౌడ ఫంక్షన్ హాల్ ప్రారంభానికి సిద్ధమయ్యాయని, నెలలోపు మిగులు పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని, రాష్ట్రానికే వైశ్య సదన్ మోడల్ అని రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్ధిపేట శివారులో జీ+1 విధానంలో నిర్మించిన వైశ్య సదనంరతినిధులతో చర్చించారు. రాష్ట్రానికే వైశ్య సదన్ మోడల్ గా నిర్మితమైందని, వేలాది మంది సీటింగ్ కెపాసిటీతో సిద్ధిపేటలోనే అతిపెద్ద ఫంక్షన్ హాల్ గా ఉంటుందని, అలాగే ఆత్మగౌరవ ప్రతీకగా సిద్ధిపేట గౌడ ఫంక్షన్ హల్ నిర్మితమైందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు సిద్ధిపేట వైశ్యులకు ఉన్న అనుబంధం విషయాలను గుర్తు చేశారు. వైశ్య సదనం ప్రధాన పనులు పూర్తికాగా పెండింగ్‌ పనులు త్వరితగతిన చేయాలని, పార్కింగ్ వసతికి అనుకూలంగా ఉండేలా అడ్డుగా ఉన్న స్టోన్ పనులు పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకు రావాలని అధికారులను, కాంట్రాక్టరును అదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డి, వైశ్య సంఘం ప్రతినిధులు కొమురవెళ్లి అంజయ్య, పుల్లూరి శివకుమార్, అనిల్ శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love