ఎంబీబీఎస్‌ చదివేందుకు ఆర్థిక ఇబ్బందులు

Financial difficulties to study MBBS– సహాయం కోసం ఎదురు చూపు
– రెండ్రోజులే అడ్మిషన్‌కు గడువు
నవతెలంగాణ-కోటపల్లి
పేదరికం చదువుకు అడ్డు కాకూడదని.. తల్లి దండ్రుల ఆశయాలకనుగుణంగా కష్టపడి చదువులో రాణించిన ఓ విద్యార్థి ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బం దులు అడ్డంకిగా మారాయి. కూలి పనులు చేస్తూ చదివి స్తున్న తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని కష్టపడి చదువుకున్న విద్యార్థి ఎంబీబీఎస్‌లో సీటు సాధించాడు. కానీ కాలేజీలో చేరేందుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడు తున్నాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కోండగుర్ల సుమంత్‌ టీఆర్‌అర్‌ఎం మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు. తల్లి సాడువలక్క, తండ్రి గుండయ్యా కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న వారికి కొడుకును ఎంబీబీఎస్‌ చదివించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. సుమంత్‌ ఒకటో తరగతి నుంచి నాలుగు వరకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో, ఐదు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు బెల్లంపల్లిలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ బార్సు కాలేజ్‌లో విద్యాభ్యాసం చేశాడు. డాక్టర్‌ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ గౌలిదొడ్డిలోని సీఓఈ కాలేజ్‌లో నీట్‌ లాంగ్‌ టర్మ్‌ చదివాడు. ఈసారి ఎంబీబీఎస్‌ సీటు సాధించినా.. అడ్మిషన్‌, కాలేజీ ఫీజు కట్టే పరిస్థితి లేక దాతలు సహాయం చేయాలని కోరుతున్నాడు. కాలేజ్‌లో జాయిన్‌ అవ్వడానికి రెండ్రోజుల సమయం మాత్రమే ఉందని, ఎవరైనా తన చదువుకు ఆర్థిక సాయం చేయాలని విద్యార్థి సుమంత్‌ వేడుకుంటున్నాడు. 8639985881 గూగుల్‌ పే నెంబర్‌, అకౌంట్‌ నెంబర్‌ 42038867795 ఎస్‌బీఐ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ :ఎస్‌బీఐఎన్‌0018873 చెన్నూర్‌.. ఈ నెంబర్లకు దాతలు తోచినంత సాహాయం కోరుతున్నారు.

Spread the love