బాన్సువాడ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

– 25 లక్షల ఆపరేషన్ థియేటర్ సామాగ్రి దగ్ధం
– పరుగులు తీసిన రోగులు..నచ్చజెప్పిన వైద్యులు

నవతెలంగాణ-నసురుల్లాబాద్ (బాన్సువాడ)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా  ప్రభుత్వ ఆసుపత్రిలో  బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం మరియు ఎవరికి గాయాలు కాలేదని. “ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఊహించని ప్రమాదం అని సంఘటనా స్థలానికి చేరుకున్న ఆసుపత్రి సుపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఏరియా ఆసుపత్రిలోని మొదటి అంతస్తలో ఉన్న ఆపరేషన్ థియేటర్ ఉదయం మంటలు రావడంతో ఆసుపత్రి వాచ్ మేన్ శివయ్య చూసి అగ్నిమాపక శాఖ కు సమాచారం అందించారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఎసి పేలడంతో మంటలు చెలరేగి నాలుగైదు గదులకు  మంటలు చెలరేగాయి 25 లక్షల విలువైన ఫర్నిచర్ ఆపరేషన్ థియేటర్ సామాగ్రి కాళీ బూడిదైంది. ఏరియా ఆసుపత్రికి ఎదుట మత శిశు సంరక్షణ ఆసుపత్రి ఏర్పడడంతో గత కొన్ని నెలలుగా ఆపరేషన్ థియేటర్ మూసి ఉంచారు. నిత్యం వాచ్ మెన్లు ఆపరేషన్ థియేటర్ గదులు శుభ్రం చేస్తున్న సమయంలో ఒకేసారి మంటలు చెలరేగడంతో విలువైన సామాగ్రి కాలి బూడిదైంది. ఆపరేషన్ థియేటర్ ముందు ఉన్న మహిళ వార్డులో ఉన్న రోగులను తరలించారు. కొందరు రోగులు భయపడి ఇంటికి తరలి వెళ్లారు. కాళీ బూడిదైనా ఆపరేషన్ థియేటర్ పక్కనే మరో గదిలో 30  లక్షల విలువైన  వైద్య పరీక్షలకు సంబంధించిన యంత్రాలు ఉన్నాయి.. సుమారు 6 గదులకు సంబంధించిన తలుపులు కిటికీలు అన్ని ధ్వంసం అయ్యాయి. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా, మంటలను పూర్తిగా ఆర్పే వరకు అగ్నిమాపక సిబ్బంది ఉండి మంటలను ఆర్పివేశారు. ఏరియా హాస్పిటల్స్ సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్ వెంటనే స్పందిస్తూ సంఘటన జరిగిన ఆపరేషన్ థియేటర్ ఎదురుగా ఉన్న రోగులను వివిధ వార్డులకు తరలించారు మరికొందరు పరుగులు తీస్తుంటే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జరిగిన సంఘటన పై ఉన్నతాధికారులకు, పోలీసులకు, అగ్నిమాపక కేంద్రంకు ఫిర్యాదు చేశారు.

Spread the love