నవతెలంగాణ-నవీపేట్: నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్ద గ్రామ శివారులోని మహాలక్ష్మి వాగులో చేపలు పట్టడానికి వెళ్లి మెట్పల్లి మల్కన్న (46) ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ శనివారం తెలిపారు. కుమారుడు మెట్పల్లి శ్రీకాంత్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.