ఆర్‌బీఐ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ : గృహ రుణ గ్రహీతలకు మరింత పారదర్శకత, వేగవంతమైన ప్రయోజనాలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక విదివిధానాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆర్‌బిఐ వడ్డీ రేట్ల సవరణకు అనుగుణంగా బ్యాంకులు తమ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను మార్పులు చేసే సమయం గరిష్ఠంగా మూడు నెలలకు మించకూడదు. ప్రస్తుతం ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ, బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు అందించడానికి ఏడాది వరకు సమయం తీసుకుంటుండటంతో ఈ కొత్త నిబంధనను తెస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై సెప్టెంబర్ 11 వరకు వాటాదారుల అభిప్రాయాలను సేకరించనున్న ఆర్‌బిఐ.. 2025 ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలు చేయనుంది. ఈ మార్పు కేవలం ఫ్లోటింగ్ రేట్ వర్తించే గృహ రుణాలకు మాత్రమే పరిమితమని, స్థిర వడ్డీ రేట్లు ఉండే వ్యక్తిగత, ఆటో రుణాలకు ఇది వర్తించదని నివేదిక పేర్కొంది.
3 నెలల్లో ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు అమలు
- Advertisement -
- Advertisement -



