చేపూర్ దత్త సాయి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

నవతెలంగాణ- ఆర్మూర్:  మండలంలోని చేపూర్ దత్త సాయి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా చేపూర్ సర్పంచ్ ఇందూరు సాయన్న, ఎంపీటీసి బాల నర్సయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, గౌరవ అధ్యక్షులు కోశాధికారి సురేష్ రుక్మాజీ లు  మాట్లాడుతూ.. ప్రతీ గురువారం దత్త సాయి ఆలయ  సన్నిధానంలో అన్నదానం చేసే భక్తులు ముందుకురావాలని, వారి పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడుతుందని, అన్నదాతలుగా అన్నదానం చేయాలనుకున్న భక్తులు ఆలయ కమిటీ వారికి 6,000/- రూపాయలు చెల్లిస్తే, మీ పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడుతుందన్నారు. అలాగే పెళ్ళి  శుభ కార్యక్రమాలకు శాఖాహార భోజనాలకు కళ్యాణ మండపం కూడా ఇక్కడ బుకింగ్ చేసుకోవచ్చని వివరాలకు సురేష్ రుక్మాజి (నం:9885061261)ని  సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో చేపూర్ గ్రామస్తులు, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love