పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్‌ – 24మందికి అస్వస్థత

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్‌ : పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి దాదాపు 24మంది అస్వస్థతకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భోజ్‌పూర్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానిక గ్రామస్థులు ఉమా శంకర్‌ మాట్లాడుతూ …. భోరాహి తోలా నివాసి బిమల్‌ యాదవ్‌ కుమారుడు అజరు యాదవ్‌ ఆధ్వర్యంలో పెళ్లి కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ తిలకంలో పాల్గనేందుకు అందరూ శుక్రవారం వచ్చారని తెలిపారు. నిన్న రాత్రి అందరూ స్వీట్లు, చేపల కూర తిన్నారని… దీని తర్వాత ఒక్కసారిగా అందరూ అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అస్వస్థతకు గురైన వారంతా తోలా, అయర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బర్నాన్‌, పసౌర్‌ గ్రామాలకు చెందిన నివాసితులని చెప్పారు. వారిలో చాలామంది పిల్లలు, ముసలివారు, చాలా మంది మహిళలు ఉన్నారని … వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అరిచారని వివరించారు. వెంటనే అందరినీ చికిత్స కోసం జగదీష్‌పూర్‌ సబ్‌-డివిజనల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా వారి ఆరోగ్యం మెరుగుపడలేదని అనంతరం మెరుగైన వైద్యం కోసం అందరినీ అర సదర్‌ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. చాలా మంది స్వీట్లు మాత్రమే తిన్నారని, మరికొందరు చేపలు, అన్నం కూడా తిన్నారని బంధువు తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరి పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉందని అర సదర్‌ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ డాక్టర్‌ సుజిత్‌ తెలిపారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ప్రజలందరికీ ప్రథమ చికిత్స అందించారు. కొందరిని అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత, వారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అవుతారని డాక్టర్లు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Spread the love