నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద ఐటీ ఉద్యోగులు కేక్ కట్ చేసి బర్త్డే విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్డే సీబీఎన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వేడుకల తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.