క్రైస్తవులకు

– రూ.ఒక లక్ష ఆర్థిక సహాయం
– ఆగస్టు 14లోగా దరఖాస్తు చేసుకోవాలి
– రాష్ట్ర క్రైస్తవ మైనార్టీల ఆర్థిక సహాయ సంస్థ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆర్థిక సహాయ పథకం కింద క్రైస్తవులకు వంద శాతం సబ్సిడీతో ఏదైనా ఒక యూనిట్‌ నెలకొల్పుకునేందుకు రూ.ఒక లక్ష అందించనున్నట్టు రాష్ట్ర క్రైస్తవ మైనార్టీల ఆర్థిక సహాయ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.కాంతి వెస్లీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల వారైతే ఏడాదికి రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.రెండు లక్షలలోపు ఆదాయం కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తుదారుల వయస్సు 21 ఏండ్ల నుంచి 55 ఏండ్ల లోపుండాలి. షషష.్‌రశీbఎఎర.స్త్రశీఙ.ఱఅ లో ఈ నెల 31 నుంచి ఆగస్టు 14లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ అధికారిని గానీ లేదా 040-2339 1067లో సంప్రదించాలని ఆ సంస్థ సూచించింది.

Spread the love