క్షత్రియ పాఠశాలలో విద్యార్థుల అరణ్య కార్యక్రమం

నవతెలంగాణ-ఆర్మూర్ :  మండలంలోని చేపూర్ క్షత్రియ స్కూల్ నందు పూర్వప్రాథమిక విద్యార్థుల క్షత్రియ అరణ్య అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. క్షత్రియ విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రీ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి శ్రీ అల్జాపూర్ గంగాధర్ , ప్రిన్స్ పాల్ లక్ష్మీనరసింహస్వామి వ ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ప్రకృతి సంపదకు, ప్రకృతి అందానికి మనదేశం నిలయమని అన్నారు. అటువంటి ప్రకృతి వనాన్ని బయట ప్రపంచం లోకి వెళ్ళి చూడలేక పోతున్న పూర్వ ప్రాథమిక విద్యార్థుల  కొరకై కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ప్రకృతివనంలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అడవి అంతా కలియతిరిగినారు.  విద్యార్థుల అడవి జంతువుల వేషధారణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థుల సింహం, పెద్దపులి, ఎలుగు బంటు లాంటి క్రూర జంతువుల వేష ధారణ ,ఏనుగు, కుందేలు లాంటి అడవి జంతువుల వేష ధారణలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి  మాట్లాడుతూ “క్షత్రియ ఆరణ్య కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రకృతి అందాలకు పరవశమైపోయి, జ్ఞానసంపదను పెంచుకుంటారని అన్నారు. అడవుల సంరక్షణ, వన్య ప్రాణుల రక్షణ మరియు  పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత అని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. అడవులు మానవాళికి ఎలా ఉపయోగ పడుచున్నవో వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love