Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండ్రి మారప్ప వర్ధంతి వేడుకలో మాజీ ఎమ్మెల్యే

తండ్రి మారప్ప వర్ధంతి వేడుకలో మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే  హన్మంత్ షిండే తండ్రి కీ.శే. మాదప్పా షిండే 11వ వర్ధంతిని వారి స్వగ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మంత్ షిండే, వారి కుటుంబ సభ్యులు కలిసి కీ.శే. మాదప్పా షిండే చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. వారి సేవలను, జీవిత విలువలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని సంకల్పించారు. అనంతరం గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కుటుంబ సభ్యులు, గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -