Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ లో పాలకవర్గం సభ్యుల సమావేశం

బస్వాపూర్ లో పాలకవర్గం సభ్యుల సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం సోమవారం సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ అధ్యక్షతన జరగింది. ఈ క్రమంలో వారు పలు తీర్మాణాలు ఆమోదించారు.

ఎజెండా అంశములు :
వర్షాకాలం ప్రారంభం అవుతున్నాయి కావున తాగు నీటిని క్లోరైజేషన్ ఎప్పటికప్పుడు చేయాలని, బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించాలి
మురికి కాలువలు శుభ్రపరచుకోవాలి, ప్రతి ఒక్క ఓటర్ తమ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
చేతిపంపులు రిపేరు చేయాలి 
ఆరవ వార్డు ఇందిరమ్మ కాలనీ నీటి సమస్య పరిష్కరించాలి
నూతన సీసీ డ్రైనేజీలు నిర్మించాలి
నిర్మాణ దశలో ఉన్న పాఠశాల ప్రహరీ గోడను పూర్తి చేయాలి
హమాస్ బల్బులు అవసరమైన చోట వెంటనే ఏర్పాటు చేయాలి
ప్రజల సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చి వార్డ్ సభ్యులందరూ తమ తమ వార్డులలో సమస్యలను తెలుసుకొని పరిష్కరించుకునే విధంగా సమావేశంలో చర్చించాలి.
ఎజెండా అంశాలపై పాలకవర్గం చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -