పురుషుడితో కుస్తీ పోటీలో పాల్గొన్న మహిళా పహిల్వాన్
నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాల్లో భాగంగా శనివారం భారీ ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రారంభించారు. గోశాల ఆవరణంలో జరిగిన ఈ కుస్తీ పోటీలో పురుషుడితో హహాళా పహిల్వాన్ పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ కమీటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం షిండే మాట్లాడుతూ.. కుస్తీ పోటీలలో మహిళలకు కూడా పాల్గొనడం శుభ పరిణామం అన్నారు. పురుషుల కంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అనడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. పురుషుడితో మహిళ పోటీపడి గెలుపొందిందన్నారు. ఈ సందర్భంగా మహళను అక్కడున్నవారంతా అభినందించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు భారీ ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహించారు.




