Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటరు సవరణ ప్రక్రియలో మాజీ ఎంపీపీ అనసూయబాయి

ఓటరు సవరణ ప్రక్రియలో మాజీ ఎంపీపీ అనసూయబాయి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ఓటర్ సవరణ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ఫారాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రామ్ పటేల్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనసూయ బాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాజీ ఎంపీపీ మాట్లాడుతూ.. ఓటరు సవరణ ప్రక్రియ కార్యక్రమం చక్కటి కార్యక్రమం అని ఈ కార్యక్రమం ద్వారా డబుల్ ఓటు లేకుండా నివారించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు గల్లంత కాకుండా గ్రామ సర్పంచ్ గా కృషి చేస్తున్నట్లు విశాలాక్షి రామ్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామ్ పటేల్ గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -