Thursday, July 9, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఎస్ఐఆర్ ఫారాల ఆన్ లైన్ వెంటనే పూర్తి చేయాలి

ఎస్ఐఆర్ ఫారాల ఆన్ లైన్ వెంటనే పూర్తి చేయాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ – ముధోల్ 

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, గురువారం బాసర, తానూర్, మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా బాసర గ్రామపంచాయితీ ఆవరణలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పరిశీలించారు. గడువులోగా ఎస్ఐఆర్ ఫారముల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ఫారాలను పూరించుటలో ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటివరకు పూర్తయిన ఎస్ఐఆర్ ఫారముల డిజిటలీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓ లు క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎస్ఐఆర్ విషయంలో సహాయం చేయాలన్నారు. సూపర్వైజర్లు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

ఆనంతరం తానూరు మండలం సింగన్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. మొత్తం పంపిణీ చేసిన ఫారములు, ఇప్పటివరకు, తిరిగి తీసుకున్న ఫారములు, పూర్తి చేసిన డిజిటలైజేషన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలలో తహసిల్దార్లు పవన్ చంద్ర, మహేంద్రనాథ్, బాసర సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్,  అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -