Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐఎన్టియుసి ఆధ్వర్యంలో మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు

ఐఎన్టియుసి ఆధ్వర్యంలో మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జన్మదిన వేడుకలు గురువారం మండల కేంద్రంలోని ఈజీఎస్ కార్యాలయంలో ఐఎన్టియుసి యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మంత్రి సీతక్క రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని అన్నారు. భవిష్యత్తులో పేదలకు మరింత సేవలందిస్తూ బడుగు బలహీన వర్గాల ఉన్నతికి కృషి చేయాలని కోరారు. భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి యూనియన్ మండల అధ్యక్షులు యాదవ్, ఉపాధ్యక్షులు సునీల్, ప్రధాన కార్యదర్శి విట్టల్, కోశాధికారి హన్మంత్, ఇరు మండలాలకు చెందిన క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -