కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి

నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్, కర్ణాటక మంత్రివర్యులు జమీర్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ  ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తహేర్ బిన్ హందన్,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ  చేసిన సంస్కరణలు గాని దీర్ఘకాలిక ఆలోచనలు గాని దేశం ఈనాడు ప్రపంచ స్థాయిలో నిలవడానికి కీలకంగా మారాయని వారు అన్నారు.అదేవిధంగా రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలన కై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టి దేశ ప్రజల అభ్యునతికి,దేశం అభివృధి చెందే ఆలోచనలు చేసిందని అన్నారు.ఇందిరాగాంధీ గారు మరణించిన కూడా ఎప్పడికి ప్రజల్లో గుండెల్లో వుండే నాయకురాలి,ఇందిరా గాంధీ అంటే శాశ్వత ముద్ర అని వారు అన్నారు.దేశ యువకులు ఆమె ఆలోచనలను ఆశయాలను ముందుకు తిస్కువెళ్ళలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో రత్నాకర్,రం బుపాల్,జావేద్ అక్రమ్, సంతోష్, విజయలక్ష్మి, పంచరెడ్డి చరణ్,బొబ్బిలి రామకృష్ణ, విజయ్ పాల్ రెడ్డి,ఈసా, ఏజాస్,రాజు, సకినల శివ కుమార్,వరుణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Spread the love