ఆర్మూర్ లిల్లీపుట్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవ సంబరాలు

జాతీయ క్రీడా దినోత్సవ సంబరాలు
జాతీయ క్రీడా దినోత్సవ సంబరాలు

నవతెలంగాణ ఆర్మూర్
పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్రీడ మైదానాల గురించి మేల నిర్వహించడం జరిగింది. ఈ మేళలో స్పోర్ట్స్ కోడ్ ఆటకు ఎలా ఉంటుందో విద్యార్థులు స్పోర్ట్ గురించి వివరించారు. అంతేకాకుండా పాఠశాలలోని విద్యార్థులందరికీ క్రీడాలు కబడ్డీ  కోకో ఆటలు ఆడించి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ధ్యాన్చంద్ యొక్క జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేశారు. ఆటలు ఆడడం వల్ల విద్యార్థులు ఎంతో మానసిక ఉద్దేశంతో ఉంటారని తమ పాఠశాలలో కూడా ఆటలో ప్రతిభవంతులైన విద్యార్థులు ఉండటం చాలా గర్వకారణం అని వారి జిల్లా స్థాయిలో గత ఏడాది బహుమతి అందుకోవడం చాలా సంతోషకరమని ఇలానే ప్రతి రంగంలోనూ తమ విద్యార్థులు ముందుండాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ పాఠశాల ప్రిన్సిపాల్ దాసు పిటి అనిల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love