Sunday, May 3, 2026
E-PAPER
Homeజిల్లాలుహరీష్ రావును కలిసిన మాజీ జెడ్పిటిసి తానాజీ రావు 

హరీష్ రావును కలిసిన మాజీ జెడ్పిటిసి తానాజీ రావు 

- Advertisement -

నవతెలంగాణ-గాంధారి 
గాంధారి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తానాజీరావు ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో నియోజవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గాంధారి మండలంలో జడ్పిటిసితో పాటు అన్ని గ్రామాల ఎంపీటీసీలు గెలుచుకునే విధంగా పార్టీ నాయకులను సమన్వయం చేసుకొని మండలంలో జడ్పిటిసితో పాటు ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని హరీష్ రావు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు తానాజీ రావు పుట్టినరోజు కావడంతో హరీష్ రావు శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -