Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాప్ తో కూలీలకు తప్పని తిప్పలు

యాప్ తో కూలీలకు తప్పని తిప్పలు

- Advertisement -

సంకటంగా మారిన రెండు ఫొటోల విధానం..
విబిజి రాంజి రద్దు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ ర్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రాంజీ)గా మార్పు చేసింది.గతంలో జాబ్ కార్డు కలిగిన కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 125 రోజుల పని దినాలు అమలు చేస్తున్నారు.మండలంలో 8,495 వేల జాబ్ కార్డులు ఉండగా ఇందులో 18,873 మంది కూలీలు ఉన్నారు.యాక్టివ్ గా ఉన్న కూలీలు10,632  కూలీలు ఉన్నారు.పథకం ప్రారంభం నుంచి నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ వినియోగించారు.దాని ప్రకారం కూలీల హాజరు మ్యానువల్ గా తీసుకునేవారు.అలాగే చేసిన పనితోపాటు అదనపు భత్యాలు (వేసవి భత్యం) కూలితో కలిపి 30 శాతం అదనంగా ఇచ్చేవారు.పనిప్రదేశం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే కిలోమీటర్కు కొంత చొప్పున చెల్లించేవారు.తాగునీటికి సైతం డబ్బులు వేతనాల్లో జమ చేసేవారు.కానీ నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్లో ఈ సదుపాయాలన్నీ తొలగించారు.కేవలం చేసిన పనికి మాత్రమే వేతనంగా చెల్లిస్తున్నారు.ఏళ్లుగా పని ముట్లు అందకపోగా పని ప్రదేశాల్లో నీడ,తాగునీరు లేదని కూలీలు ఆరోపిస్తున్నారు.

ఆన్లైన్లో హాజరు..
ప్రస్తుతం పనులకు సంబంధించి హాజరు అంతా ఆన్లైన్లో తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎన్ఎంఎస్) యాప్లో వివరాలు పొందుపరుస్తున్నారు. ఉదయం పూట ఒకసారి.మధాహ్నం తర్వాత మరో ఫొటోను(మొదటి ఫొటో అప్లోడ్ చేసిన నాలుగు గంటల తర్వాత) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.అయితే ఉదయం తీసుకునే ఫొటోలో కచ్చితంగా ఒక్కో కూలీకి సంబంధించిన ఐరీస్ ఉండాలి.మధ్యాహ్నం గ్రూప్ ఫోటోను అప్లోడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది కూలీలకు సంబంధించిన ఐరీస్ ను సాఫ్ట్వేర్ తీసుకోవడం లేదు.దీంతో వారు పనులు చేయకుండానే ఇంటికి వెళ్తున్నారు.ఒక్కోసారి కూలీల ఐరీస్ ఒకరోజు తీసుకుంటే..మరోరోజు ఐరిస్ తీసుకోకుండా ఫేస్ మిస్ మ్యాచ్ అని చూపిస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని విబిజి రాం యాప్ రద్దు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.ఆన్లైన్ హాజరుకు అధిక సమయం పడుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండిపోతుండటంతో పని ప్రదేశంలోనే నాలుగు గంటలకు పైగా ఉండాల్సి వస్తోంది. గతేడాది ఇదే సీజన్లో 2 వేలకు పైగా కూలీలకు పనులకు వెళ్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యి కూడా దాటడం లేదు.అధికారుల లెక్కల ప్రకారం మండల వ్యాప్తంగా శనివారం 982 మంది కూలీలు హాజరైనట్లుగా తెలిసింది.ఈ ఆర్థిక సంవత్సరం 96 వేల పనిదినాల లక్ష్మీ విధించారు.

పథకం రద్దు చేసే కుట్రలు: అక్కల బాపు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు
కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో నమూనాల మార్పులు చేసి పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కుట్రలు చేస్తోంది.ఇందులో భాగంగానే రెండు ఫొటోల విధానాన్ని తీసుకొచ్చింది.కొంతమంది కూలీలకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ కాకపోవడంతో పని చేయడానికి వేనుదిరుగుతున్నారు.కొత్త విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో పనులు చేపట్టి కనీస వేతనం రోజుకు రూ.600 చెల్లించాలి.పని ప్రదేశాల్లో చలువ పందిళ్లు,తాగునీరు,మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి.

125 రోజులు పనిపై ఆదేశాలు రాలేదు: హరీష్.. ఉపాధిహామీ ఎపిఓ
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన విబిజి రాంజి పథకం మార్పులో భాగంగా ప్రస్తుతం రెండు ఫొటోల విధానం అమలు చేస్తున్నాం.ప్రతి కూలికి 125 రోజులు పని కల్పించాలనే దానిపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు.రోజుకు ఒక్క కూలికి రూ.270 వేతనం అందుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -