పంచాయితీ భవనాలకు శంకుస్థాపన…..

– రూ 40 లక్షల వ్యయంతో కార్యాలయాలు నిర్మాణం…
– ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-అశ్వారావుపేట : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలకు కార్యాలయ భవనాలకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేసారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సిఫార్సు తో గిరిజనాభివృద్ధి  శాఖ ఐటిడిఎ రూ.1 కోటి 60 లక్షలు 8 భవనాలకు,పంచాయతీ రాజ్ శాఖ రూ.2 కోట్ల 40 లక్షలు 12 భవనాలకు నిధులు మంజూరు చేసాయి. శనివారం గాండ్లగూడెంలో,  వేదాంత పురం లో రెండు భావనల నిర్మాణం కోసం శంఖుస్థాపన చేశారు.వీటికి చేరో రూ. 40 లక్షలు వ్యయం చేస్తారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లోని స్థానికులతో  ఎమ్మెల్యే మెచ్చా సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నరు.
చిన్నారుల మనసు దోచిన ఎమ్మెల్యే మెచ్చా….
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నియోజక వర్గంలో ఏ గ్రామానికి  వెళ్లినా చిన్నారుల ఆయనతో ఫోటో దిగేందుకు ఇష్టపడుతున్నారు.
శనివారం అశ్వారావుపేట మండలం వేదాంత పురం వెళ్తూ పండు వారిగూడెం వద్ద ఆగి గ్రామస్తులతో మాట్లాడుతున్న సమయంలో ఆయన వద్దకు చిన్నారులు వచ్చి ఫోటో దిగాలని అడిగారు.దీంతో ముచ్చట పడిన ఆయన వారితో కలిసి ఫోటో దిగారు.రాజకీయాలు,వ్యవహారాలు ఏమీ తెలియని
కల్మషం లేని మనసులు చిన్నారులవే అంటూ కితాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ మూర్తి, జెడ్పీటీసీ వరలక్ష్మీ,సర్పంచ్ లు సోనీ శివశంకర్ ప్రసాద్,ఉప సర్పంచ్ లు,వార్డ్ మెంబర్ లు,మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Spread the love