నాలుగు సెల్ ఫోన్లో రికవరీ చేసిన ఒకటవ టౌన్ పోలీసులు

నవ తెలంగాణ- కంటేశ్వర్ :
నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు సెల్ ఫోన్ లను రికవరీ చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు సెల్ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సెల్ఫోన్లను పోగొట్టుకున్న నలుగురు బాధితులను ఒకటవ పోలీస్ స్టేషన్కు పిలిపించి అప్పగించడం జరిగిందని ఒకటవ పోలీస్స్టేషన్ ఎస్ హెచ్ విజయ్ బాబు తెలిపారు. సెల్ ఫోన్ల విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. సెల్ఫోన్ ఉపయోగించేవారు తప్పనిసరిగా ఫోను ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలని, లేనియెడల సెల్ఫోన్ పోయే అవకాశం ఉంటుందని సెల్ ఫోన్ విషయం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులను ఒకటవ పోలీస్ స్టేషన్కు పిలిపించి సెల్ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒకటవ పోలీస్స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది, బాధితులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love