తెలంగాణలో నాలుగు రోజులు వానలు

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ నుంచి మధ్య బంగా ళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆసిఫాబాద్‌ , మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ము లుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మలాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేరొంది.

Spread the love