ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : మెదక్​ జిల్లా నార్సింగి​ మండలం వల్లూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు నిజామాబాద్ జిల్లా​ ఆర్మూర్​కు చెందిన తండ్రీకుమారులు శేఖర్‌(45), యశ్వంత్‌(9), సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు చెందిన దంపతులు బాల నర్సయ్య(70), మణెమ్మ(62)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఘటన సమయంలో ఆటోలో ఎంత మంది ఉన్నారు.. ప్రమాదానికి గల కారణం ఏంటి..? మృతి చెందిన వారు కారులో ఉన్న వ్యక్తులా..! లేదా ఆటోలో ఉన్న ప్రయాణికులా అనే దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love