Monday, May 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి

వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి

- Advertisement -

తెలంగాణ వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య
నవతెలంగాణ-నూతనకల్
సంపదను సృష్టిస్తూ, దేశానికి అన్నం పెడుతున్న వ్యవసాయ కార్మికులకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వం విద్య, వైద్యం ఉచితంగా అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఆ సంఘం మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెక్కల కష్టంతో జీవిస్తున్న వ్యవసాయ కార్మికుల జీవనం దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవ డానికి బట్ట కరువైందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర కేంద్ర శాసనచట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. 50ఏండ్లు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.7,500 పింఛన్ మంజూరు చేయా లన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వచ్చిన వ్యవసాయేతర కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున వారికి ఉపాధి కల్పించాల న్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రోజురోజుకు నిర్వీర్యం చేస్తుందని విమర్శిం చారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయ కులు పోలోజు సైదులు, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -