Saturday, June 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం

- Advertisement -


సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుస్తాం : ఎండీ నాగిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దేశవ్యాప్తంగా ఈనెల 21న నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్‌ ‌రాసే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఆ సంస్థ వైస్ చైర్మెన్‌, మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించాలని సూచించారు. తమ ఇండ్ల నుంచి పరీక్షా కేంద్రాల వరకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఉచితంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఈ ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయం సంస్థకు చెందిన ఏసీ సర్వీసులు మినహా మిగతా అన్నీ బస్సులలో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ పరీక్షకు దాదాపు 73 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్న నేపథ్యంలో, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తుగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈనెల 21న తొలి సర్వీసు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సదుపాయాన్ని అభ్యర్థులు వినియోగిం చుకోవచ్చన్నారు. ఏవైనా ఆటంకాలు ఎదురైతే టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-23450033, 6815 3333 లో సంప్రదించాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు సకాలంలో చేరుకోవడానికి అభ్యర్థులు ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. పరీక్ష‍కు హాజరయ్యే విద్యార్థులందరికీ సంస్థ తరఫున నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -