ఉచితంగా షుగర్ రక్త పరీక్షలు..

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు 
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో ఉచితంగా పేద ప్రజలకు రక్త పరీక్షలు మరియు షుగర్ పరీక్షలను నిర్వహించినట్లు ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు తెలిపారు. మేచరాజు పల్లి  గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు నల్ల పద్మయ్య రాజ్యలక్ష్మి  జ్ఞాపకార్థం వారి కుమారుడు నాళ్ల వేణుమాధవ్  గత మార్చి నెలలో ఉచిత మెగా క్యాంపును నిర్వహించి నేడు షుగర్ మరియు రక్త పరీక్షలు 300 మందికి ఆదివారం ఆ గ్రామ మాజీ సర్పంచ్ వేలిశాల లక్ష్మి దేవేందర్ రావు తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో ఉచితంగా ఈ క్యాంపును నిర్వహించారని అన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించినట్లు తెలిపారు. ఈ క్యాంపులో గ్రామంలోని సుమారు 300 మంది  యువతీ యువకులు ముందుకు వచ్చి వారి వారి పరీక్షలు చేసుకోవడం జరిగింది అని అన్నారు. గతంలో ఈయన ఉచిత మేఘ క్యాంపు నిర్వహించి ఎంతోమందికి పేదలకు ఉచితంగా మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గ్రామస్తులు అభినందించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం తనవంతు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని అన్నారు. అనంతరం నాళ్ళ వేణుమాధవ్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. సేవ చేయడం ఒక వరం లాంటిదని తెలిపారు ఇలాంటి అవకాశాన్ని గ్రామస్తులు కల్పించడం నాకు ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తపరిచారు రానున్న రోజుల్లో పేదల అభివృద్ధి కోసం పాటుపడతానని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామం అభివృద్ధి కోసం పేదల అభివృద్ధి కోసం గ్రామస్తులు ఎవరైనా ముందుకు వచ్చి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దీపక్ ఫార్మసీ నుండి నలుగురు మహిళా టెక్నీషియన్లు మరియు, మోహనరావు,  ముంజంపల్లి దేవేందర్, మోరుపోజు అశోక్, బాదావత్ సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love