Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోనాపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం

కోనాపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం

- Advertisement -

– శిబిరంలో పాల్గొన్న కోరుట్ల పశు వైద్య కళాశాల విద్యార్థులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ గ్రామంలో మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ రిక్క అరుణ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ శిబిరంలో  గైనకాలజి ప్రొఫసర్లు డాక్టర్ వెంకటేష్, డాక్టర్ విశాల్ గర్భనిర్ధారణ పరీక్షలు చేశారు. గర్భ సమస్యల గురించి వివరించి, రైతులకు పలు సూచనలు ఇచ్చి తగిన చికిత్స లను అందించారు. గొర్రెలు, మేకలకు అనారోగ్య సమస్యలను మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ పరిశీలించి తగు చికిత్సలను నిర్వహించారు. అదేవిధంగా డాక్టర్ రమేష్, భూమయ్య పశువులకు పేడ పరీక్షలు నిర్వహించారు. తద్వారా పశువులకు వ్యాపించిన వ్యాధులను గుర్తించి తగిన చికిత్సలు చేశారు.ఈ కార్యక్రమంలో 8 ఆవులు, 43 బర్రెలు, 67 గొర్రెలు, 26 మేకలకు చికిత్సలు అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ పశువులకు గర్భకోశ వ్యాధుల గురించి రైతులకు తగిన సూచనలు చేశారు. జరిగింది. ఈ కార్యక్రమంలో చౌటుపల్లి పశువైద్యాధికారి డాక్టర్ వసంత్, పశువైద్య సిబ్బంది  ప్రవీణ్ రెడ్డి, పాడి రైతులు, పశు వైద్య కళాశాల విద్యార్థులు, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -