సాటాపూర్ గ్రామంలో గడపగడపకు ప్రచారం..

నవతెలంగాణ- రెంజల్:
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న సర్పంచి వికార్ పాషా. గత పది సంవత్సరాల  ప్రభుత్వం హయాంలో అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీకే సాధ్యమైందని వారు పేర్కొన్నారు. బుధవారం గ్రామంలోని రజకుల ఇళ్లలో కి వెళ్లి ప్రభుత్వం ఉచిత కరెంటును అందజేశారని, వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఎస్ కే అహ్మద్, స్థానిక నాయకులు కే సాయిలు, సురేష్, డైరెక్టర్ సాయిలు, రఫిక్ ఖాన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love