నవతెలంగాణ – హైదరాబాద్
జన ఉద్యమకారుడు గద్దర్ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. పాటలతో ప్రజా ఉద్యమాలు నడిపిన విప్లవకారుడు గద్దర్ అని అభివర్ణించారు. ప్రజాఉద్యమ పాటలంటే గద్దరే గుర్తుకు వస్తారని తెలిపారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నానని బాలకృష్ణ వెల్లడించారు.