గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాలి..

నవతెలంగాణ -రాయపోల్
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించే పీడిత ప్రజల గొంతుక ప్రజా యుద్ద నౌక గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ రాయపోల్ మండల అధ్యక్షులు శేషాచారి అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గద్దర్ యాదిలో సంస్కరణ సభ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్ జీవితమంత అణగారిన,పీడిత ప్రజల కోసం పోరాటం చేస్తూనే ప్రజలను చైతన్యం చేస్తూ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన జీవితమే త్యాగం చేశాడని ఆయన నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. గద్దర్ స్ఫూర్తిగా నేటితరం చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.టిపిటిఎఫ్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 వ తేదీన గురువారం సాయంత్రం 5:00 గంటలకు గద్దర్ సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క హాజరవుతున్నారు. కావున ప్రజాయుద్ధ నౌక గద్దర్ సంస్మరణ సభకు కవులు, కళాకారులు, మేధావులు,ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదలు,ఉపాధ్యాయులు, విద్యావంతులు,యువకులు,గద్దర్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, ఉపాధ్యాయులు వెంకట్,నర్సింగరావు, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, స్వరూప, రమ్య, కుసుమ, మంజుల, ప్రశాంత్ వర్ధన్, సుధాకర్, సిఆర్పిలు కుమార్ స్వామి, ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love