– మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రజా గాయకుడు గద్దర్ మరణం తమను కలచివేసిందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విప్లవ సాధనలో జన నాట్య మండలి ఇంఛార్జీగా పార్టీకి గద్దర్ అందించిన సేవలు ఎనలేనివని ఆయన అన్నారు. ముఖ్యంగా, నాలుగేండ్ల పాటు అజ్ఞాతంలో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో సైతం జన నాట్య మండలిని విస్తరించటంలో గద్దర్ చేసిన కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. 2012లో గద్దర్‌ను పార్టీ నుంచి తొలగించటం జరిగిందని తెలిపారు.