కందకుర్తి గాట్ల వద్ద చెత్తాచెదారంతో భక్తులకు అసౌకర్యంగా మారింది..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం ప్రధాన ఘట్ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోయి భక్తులకు అసౌకర్యంగా మారిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి శుక్ర, సోమవారాలలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి తమ పుణ్య స్థానాలను ఆచరిస్తారు. గాట్లపై బురద చేరికపోయి నడవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు పుష్కరాల సమయంలో వచ్చిన హుండీ డబ్బులను తీసుకువెళ్లడం తప్ప ఘాట్లను పరిశుభ్రం చేయడంలో విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ కానీ, పుష్కర కమిటీ సభ్యులు కానీ గాట్ల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారని తొలగించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Spread the love