బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి

నవతెలంగాణ -పెదవూర
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి సూపిస్తామని నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదిత రెడ్డి అన్నారు. బుధవారం అనుముల మండల పార్టీ అధ్యక్షుడు భైరవబోయిన శంకర్ , ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బూత్ అధ్యక్షులు  కమిటీ లోని  సభ్యులను సభ్యులను కలుపుకొని ప్రతి రోజూ ప్రజలను కలసి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద చైతన్యవంతం చేయాలని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ  సేవలు తెలియజేస్తూ బీజేపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ షేక్ బాబా, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి,జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు శ్రీ పాషా, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ శ్రీ చనుముల వెంకట రెడ్డి, హాలీయా పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ , మండల గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Spread the love