
– ఆయిల్ఫెడ్ అధికారులను ఆదేశించిన మంత్రి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫాం సాగు ను విస్తరిస్తున్న క్రమంలో భూమి ఉండి,పట్టా లేక ఇతరు పంటలు సాగు చేసుకుంటున్న ప్రతీ రైతుకు రాయితీ ఆయిల్ ఫాం మొక్కలు అందజేయాలని తెలంగాణ ఆయిల్ ఫాం ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కు వినతి పత్రం అందించారు. మంగళవారం గండుగుల పల్లి లోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రం లో ఆయన్ను కలిసి ఆయిల్ ఫాం సాగు,మద్దతు ధర,పట్టా లేని సాగు దారులకు రాయితీ మొక్కలు అందించాలనే అంశాలు పై ఆయన చర్చించారు. పట్టా భూమి లేని సాగు దారులకు రాయితీ మొక్కలు అందించాలనే అంశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుముఖంగా ఉన్నారని రామచంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫాం సాగు రైతు బండి భాస్కర్,ఆయిల్ఫెడ్ డివిజనల్ అధికారి ఆకుల బాల క్రిష్ణ,అప్పారావు పేట పరిశ్రమ మేనేజర్ కళ్యాణ్ గౌడ్ లు ఉన్నారు.