ప్రభుత్వ మొండి వైఖరిని వీడేలా చూడు దేవుడా!

నవ తెలంగాణ- రామారెడ్డి:
 ప్రభుత్వ మొండి వైఖరిని వీడేలా చూడాలని అంగన్వాడీలు శనివారం శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 రోజుల నుండి అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. వెంటనే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు
Spread the love