బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి: గొంది దివాకర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో బడి ఈడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించాలని మండల విద్యాధికారి గొంది దివాకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు కే రఘురాం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ దివాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు గ్రామస్తులు స్వయం సహాయక సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల ను బలోపేతం చేయాలని అన్నారు. ఐదు సంవత్సరాలు వయసు పైబడిన విద్యార్థులను గుర్తించి సమీపంలోని పాఠశాలలో చేర్పించాలి పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం రెండు జతల యూనిఫార్మ్స్ మధ్యాహ్న భోజనం రాగిజావ డిజిటల్ క్లాస్ రూమ్ బోధన ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు  మొదలగునవి  అందించడం జరుగుతుందన్నారు .వి ఈ ఆర్ రిజిస్టర్ను బడి ఈడు గల  0 నుండి 15 వయసు గల పిల్లలను గుర్తించి రిజిస్టర్లు పూర్తి చేయాలి అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో  సమావేశమును నిర్వహించి బడిబాటను గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వారు ఎస్ హెచ్ జి సభ్యులు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Spread the love