అందరొచ్చేస్తున్నార్ రా ఇంకొస్తున్నర్ గద ఇర్చికుంట, వైష్ణవి బకిట్ల నీళ్ళు చంబుతోన తీసుకొని చిలకరించు జారంతైన సళ్ళగొడ్తది. మంగ! తల్పుకడ సంచిలో యాపరెమ్మలు, మామిడిరెమ్మలు ఉన్నాయి అందరోచిన్నంక తలొకటి సెతికియ్యలే ఇసుర్కొనికే నల్నింషల్ ఇసుర్కొన్నాక ధ్యానం షురూ బెట్టోచు నడుమిట్ల చమట చిట్ట చిట్ట అనిపిస్తే గాడ గంపలున్న నీళ్ళతోనే కడ్కొండ్రీ ఎండ కాలం అంటే గొంతే మరి.
నిన్న మీ శర్వానంద సారు రేడియో ప్రోగ్రాం ఇయ్యానికే రాస్నా ఇస్పీచు తీసుకోచ్చి ఈరోజు వారసత్వ దినం అనుకుంట మంచిగా సద్వినావ్ రా కమలేష్ ఇస్పిచ్ ల మీ సార్ మంచిగా చెప్పిండు. ఓర్సత్వమంటే మన తాత లా ముత్తాతలు కాడసంధి మనకొచ్చేటి గెంత భూమి, గెంత సేను, గేన్నీండ్లు గాసుంటి లెక్కల్ గావు గేట్ల గేట్ల కష్టం జేసీ ఏంమేం సాధించిండ్రూ గెంత మంచి పేరుతో నీ బతికిండ్రు గసొంటివి కుళ్ళ కుళ్ళ జెప్పిండ్రు, ను సద్విన తీరుతో నీ గూడ మంచిగా సంజైంది.
అంబేద్కర్ దినం నాడు జడ్జీష్ మొకం ల చిన్న గర్వం గాదు చిన్న ఖుషి గాదు తన బతుకుల మంచి మార్పోచిన దినం అని సరింగ ఒక్కేడు అని గీ దినం గిట్ల ఉన్నానంటే గొప్పదనం అంబేద్కర్ సార్దే నాకు బుద్ధి చెప్పిన పెద్దక్క దే అనుకుంట గొంతు ఓనుకుంట కండ్లు తుడ్చుకుంట చెప్పిండు నాదెంది రా నువ్వు బాగు పడే దినం ఒచ్చింది అయినావు.ఏమైనా పెద్దోళ్ళు చెప్తే మన మేలు కొరకే అని రాసా పడకుంట అర్థం చేసుకుంటా సుల్బంగ బాగుపడతారు,అందర్ని సంతోష పెడతారు
– గంగరాజ పద్మజ, 9247751121



