మన రోజువారీ జీవితంలో ఎక్కువగా వినిపించే మాట ఏదైనా ఉందంటే అది ‘సాకు’. ఉదయం ఆలస్యంగా లేవడానికి సాకు, పని సరిగా చేయకపోవడానికి సాకు, మార్పును అంగీకరించకపోవడానికి సాకు. ”కాలం మారుతోంది” అని మనం తరచూ చెప్పుకుంటాం. కానీ నిజంగా మనం మారుతున్నామా? లేక మార్పు పేరుతోనే సాకులు వెతుకుతున్నామా?హొఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఈ రోజుల్లో మరింత పెరిగింది. ఎందుకంటే సాకులు ఇప్పుడు కేవలం వ్యక్తిగత అలవాటుగా కాకుండా, సమాజంహొమొత్తాన్నిహొప్రభావితం చేసే ఒకహొసంస్కృతిగాహొమారుతున్నాయి.
సాకుహొఅనేది సమస్య కాదు. సమస్యనుహొఎదుర్కొనకుండాహొతప్పించుకునే మార్గం. నిజమైనహొసమస్యనుహొగుర్తించిహొపరిష్కారం వెతకడం కష్టమైన పని. దానికి బదులుగా కారణాలు చూపించడం సులువు. అందుకే ”సమయం లేదు, అవకాశం రాలేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు’ వంటి మాటలు మన నిత్య జీవితంలో భాగమయ్యాయి.హొఇవిహొకొన్ని సందర్భాల్లో నిజమే కావచ్చు. కానీహొఅవేహొమన శాశ్వతహొసమాధానాలుగాహొమారితే, మన పురోగతి అక్కడేహొఆగిపోతుంది.
ఈ రోజు చదువు విషయానికొస్తే, ఉన్నత విద్యలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గత పది సంవత్సరాల్లో గణనీయంగా పెరిగిందిహొఅనిహొగణాంకాలు చెబుతున్నాయి. అయినా సరే, ఉద్యోగాల విషయంలో యువతలోహొతీవ్రమైనహొనిరాశహొనిస్పహలుహొఎక్కువగాహొకనిపిస్తున్నాయి.హొఅదేహొవిధంగాహొనేటిహొవిద్యార్థులు ‘ఉద్యోగాలు లేవు’హొఅనిహొతరచుగాహొఅంటున్నారు.
సంస్థలుహొమాత్రంహొనేటిహొయువతలోహొపరిశ్రమకుహొకావలసినహొనైపుణ్యాలహొలేమిహొఅనిహొఅంటున్నాయి.హొఅలానేహొవిద్యా వ్యవస్థహొమారుతున్నహొపరిస్థితులకుహొఅనుగుణంగాహొసిలబస్‌లో మార్పుహొఅనివార్యంహొఅనిహొఅంటుంది. ఈ మూడు మాటల మధ్య నిజమైనహొపొంతనహొలేకపోగాహొసమస్యహొజఠిలమైహొపరిష్కారం కాకుండా, సాకుల పరంపరహొకొనసాగుతుంది.హొకాగాహొఅదే పరిస్థితుల్లో కొందరు యువకులుహొమాత్రంహొకొత్త నైపుణ్యాలుహొనేర్చుకొనిహొచిన్న అవకాశాల నుంచే తమహొసుదీర్ఘహొఉపాధిహొప్రయాణాన్నిహొకూడాహొప్రారంభిస్తున్నారు. మరికొందరు మాత్రంహొఇవేహొపరిస్థితులను సాకులుగా మార్చుకుని ఎదురుహొచూస్తూహొకాలయాపనహొచేస్తున్నారు. ఇక్కడహొగమనించదగ్గహొతేడా పరిస్థితుల్లో కాదు,హొయువతహొఆలోచనలో నిమగం అయి ఉంది.
అలానేహొమన చుట్టూ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా కష్టపడే వ్యక్తికి సాకుల అవసరం ఉండవు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మార్గం వెతుక్కుంటాడు. అదే ప్రయత్నం చేయనివాడు మాత్రం పరిస్థితులనే కారణాలుగా చూపిస్తాడు. వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వర్షాభావం, ఖర్చుల పెరుగుదల, మార్కెట్ సమస్యలు నిజమైనవే. కానీ అదే పరిస్థితుల్లో కొందరు రైతులు ఆధునిక పద్ధతులు అనుసరించి, పంటల వైవిధ్యం పెంచు వంగడాలను వినియోగిస్తూ తమ జీవనాన్ని వెల్లదీస్తున్నారు. మరికొందరు మాత్రం ఏ మార్పూ చేయకుండా నష్టాలకు కారణాలు చెబుతూనే ఉంటున్నారు. సమస్యలు ఒకటే కానీ స్పందన మాత్రమే వేరు.
ఇకహొనాయకత్వం అంటే గొప్ప మాటలు చెప్పడం కాదు. సంస్థలు సమస్యల బారిన పడినపుడు బాధ్యత తీసుకోవడం నాయకుడి ప్రధమ కర్తవ్యం. ఆలా కాకుండా సాకుల మీద ఆధారపడే అది నాయకత్వం సంస్థల్ని, సమాజాన్ని ముందుకు నడిపించలేదు. చరిత్రను చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి పెద్ద మార్పు మొదట వ్యతిరేకతనే ఎదుర్కొంటుంది. ‘ఇది సాధ్యం కాదు’, ‘ఇప్పుడు సమయం కాదు’ అనే మాటలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ నిర్ణయాత్మక నాయకత్వమే సాకుల జోలికి పోకుండా పెను మార్పులకు దశ దిశా నిర్దేశిస్తారు. మన దేశంలో ఆర్థిక సంస్కరణల సమయంలో కూడా ఇదే జరిగింది. అప్పట్లో అనేక సందేహాలు, భయాలు ఉన్నాయి. అయినా సరే నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితాలు వెంటనే కనిపించకపోయినా, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సమస్యలు ఉన్నా నిర్ణయం తీసుకోవడం.
ఇకహొపరిశ్రమల విషయానికి వస్తే, ‘మార్కెట్ బాగోలేదు’, ‘పోటీ ఎక్కువైంది’ అనే మాటలు తరచూ వినిపిస్తాయి. కానీ అదే పరిస్థితుల్లో కొన్ని సంస్థలు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చాయి. డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ సేవలు,హొఅంకురాలహొఆవిర్భావంహొఇవన్నీ సవాళ్ల మధ్యే ఎదిగిన ఉదాహరణలు. పరిస్థితులను సాకులుగా కాకుండా అవకాశాలుగా చూసినవారే ఇక్కడ విజయం సాధించారు.
ఒక దేశ ఆర్థిక పురోగతి కేవలం ప్రభుత్వ విధానాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రజల పని తత్వం, బాధ్యతా భావం కూడా చాలా ముఖ్యం. సమయానికి పని చేయడం, పని నాణ్యతను పట్టించుకోవడం, తప్పు జరిగితే బాధ్యత తీసుకోవడంహొఇవిహొచిన్నహొవిషయాల్లాహొకనిపించినా, సమిష్టిగా చూస్తే దేశ పురోగతిని నిర్ణయిస్తాయి. మార్పు ఎక్కడో పై స్థాయిలోహొమొదలవాలనిహొమనం అనుకుంటాం. కానీ నిజానికి అది మన దగ్గరహొనుంచేహొప్రారంభమవుతుంది. ”నేను ఏమిహొమెరుగుపర్చుకోగలను?” అనేహొప్రశ్నహొవేసుకోవడంహొనుంచేహొనిజమైన మార్పు మొదలవుతుంది. ఇది సులువు కాదు. ఎందుకంటే ఇది మనహొసాకులనుహొప్రశ్నిస్తుంది. కానీహొసమాజంగాహొముందుకు వెళ్లాలంటే ఈ ప్రశ్న తప్పనిసరి.
సాకులు మనకు తాత్కాలిక సాంత్వన ఇస్తాయి. కానీహొఅవేహొమన ఎదుగుదలకు శాశ్వత అడ్డంకులుగా మారతాయి.హొవ్యక్తిగా,హొసంస్థగా,హొసమాజంగాహొప్రతి స్థాయిలో సాకుల నుంచి బాధ్యత వైపుహొఅడుగుహొవేయాల్సిన సమయం ఇది.హొప్రతి ఒక్కరూ తనకు తానే ఒక ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది ‘ఇది నిజమైనహొసమస్యా? లేక నేను చెప్పుకుంటున్న సాకా?’ ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే,హొఅదేహొమన సమాజానికి కొత్త ఆలోచనకు, కొత్త దిశకు ఆరంభం కావచ్చు.
డా. మైలవరం చంద్రశేఖర్, శామీర్పేట్
సాకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



