వ‌న్డేల‌కూ డేవిడ్ భాయ్ గుడ్ బై..

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అభిమానుల‌కు షాకింగ్ న్యూస్ చెప్పాడు. స్వ‌దేశంలో పాకిస్థాన్‌తో చివ‌రి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లుకనున్న డేవిడ్ భాయ్ వ‌న్డేల‌కు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే.. 2025లో జ‌రిగే చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాన‌ని తెలిపాడు. ‘నేను టెస్టులతో పాటు వ‌న్డేల నుంచి కూడా వైదొలుగుతున్నా. ఈ విష‌యాన్ని నేను వ‌న్డే ప్రపంచ క‌ప్ నుంచి చెప్తున్నా. రిటైర్మెంట్‌పై ఈ రోజు నిర్ణ‌యం తీసుకున్నా. భార‌త గ‌డ్డ‌పై వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం నా కెరీర్‌లో అతిముఖ్య‌మైన సంద‌ర్భం. ఒక‌వేళ నా శ‌రీరం స‌హ‌క‌రిస్తే వ‌చ్చే ఏడాది చాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడుతా’ అని రెండుసార్లు వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత అయిన వార్న‌ర్ వెల్ల‌డించాడు. అంతేకాదు ఇక‌పై అంత‌ర్జాతీయ టీ20 లీగ్స్‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్టు ఈ స్టార్ ఓపెన‌ర్ స్ప‌ష్టం చేశాడు.  ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ 161 వ‌న్డేల్లో 6,932 ప‌రుగులు సాధించాడు. అంతేకాదు 97.26 స్ట్రైక్ రేటుతో 22 సెంచ‌రీలు బాదిన డేవిడ్ భాయ్.. ఆసీస్ త‌ర‌ఫున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రెండో క్రికెట‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 29 సెంచ‌రీలు అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు.  ఓపెన‌ర్‌గా ఆస్ట్రేలియా క్రికెట్‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన‌ వార్న‌ర్ 111 టెస్టుల్లో 8,695 ప‌రుగులు సాధించాడు. రికార్డు స్థాయిఓల‌ 26 సెంచ‌రీలు బాదాడు. అంతేకాదు రికీ పాంటింగ్త‌ర్వాత‌ ఆసీస్ త‌ర‌ఫున అత్య‌ధిక ర‌న్స్ కొట్టిన క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించాడు.

Spread the love