సెయింట్ ఆన్స్ చర్చిలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

నవతెలంగాణ – కంటేశ్వర్
గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని స్థానిక సుభాష్ నగర్ లోని సెంట్ ఆన్స్ చర్చిలో ఉదయం 6:30 నుండి చర్చి ఫాదర్ అండ్ జోసెఫ్  అసిస్టెంట్ ఫాదర్ రోమల్డో ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తు సిలువ మార్గంలో అనుభవించిన కష్టాలను 14 స్థలాల రూపంలో యూత్ సభ్యులు నిర్మల హృదయ గ్రౌండ్ నుండి ప్రదర్శనగా చర్చి వరకు నిర్వహించారు. అదిలాబాద్ నుండి అతిథిగా విచ్చేసిన ఫాదర్ మాదాను రవికుమార్ వాక్యప్రసంగంలో గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని, ఇందుకోసం జీసస్ పడిన శ్రమలను భక్తులకు వివరించారు. జీసస్‌ను సిలువపై వ్రేలాడదీసి, చనిపోయిన రోజునే పవిత్ర శుక్రవారం, లేదా గుడ్ ఫ్రైడే అని  పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలుస్తూ ప్రార్థనలో గడుపుతారు.14 స్థలాల ప్రదర్శన అనంతరం క్రీస్తు పలికిన చివరి ఏడు మాటలను చర్చి సభ్యులు చదవగా భక్తిశ్రద్ధలతో ప్రజల ఆలకించారు. మధ్యాహ్నం మూడు గంటల నుండి తిరిగే ప్రారంభమైన ప్రార్థనలో సిలువపై యేసు మరణాన్ని గుర్తు చేసుకున్నారు. తదనంతరం చర్చి సభ్యులు ఉపవాస దీక్షల విరమణగా ఏర్పాటుచేసిన పండ్లు మరియు మజ్జిగను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చర్చ సభ్యులు మరియు కౌన్సిల్ సభ్యులు డేవిడ్ బాలస్వామి లోడ్ రెడ్డి, ప్రవీణ్,అగస్టీన్, హ్యారీ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Spread the love