నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. DPH అండ్ FW/DME విభాగంలో 431(మల్టీ జోన్-1లో 270. మల్టీ జోన్-2లో 161) ఉద్యోగాలున్నాయి. అభ్యర్థులు MBBS పూర్తి చేసి ఉండాలి. IPM డిపార్ట్‌మెంట్‌లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అర్హులు. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://mhsrb,telangana,gov.in/ సందర్శించండి. అర్హులైన అభ్య‌ర్థులు రూ. 500 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.

Spread the love